9, నవంబర్ 2017, గురువారం

How to Create Oil Paint,Digital Paintig with Effectiveness Part 2

ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా లో హల్చల్ చేస్తున్న ఆయిల్ పెయింటింగ్ ఫొటోస్ మరి వాటిని ఎలా అద్బుతంగా తయారు చేయాలో ఈ వీడియో లో చూడవచ్చు.
Link : Oil painting with effectiveness


ఇదివరకే ఆయిల్ పెయింటింగ్ ఫిల్టర్ ఏ విధంగా ఇన్స్టాల్ చేస్కోవాలి అలాగే దానిని ఎలా ఉపయోగించుకోవాలి అనే విషయం పై వీడియో చేయడం జరిగింది ఆ వీడియో చూచుటకు ఈ క్రింది లింక్ పై క్లిక్ చేయండి
పార్ట్ 1 వీడియో : How to create oil paint

మరి ఈ వీడియో లో అదే ఆయిల్ పెయింటింగ్ ఫిల్టర్ తో పాటు మరిన్ని ఎడిట్స్ చేస్తూ మీ ఫోటోని అద్బుతంగా డిజిటల్ పెయింటింగ్ వలే ఏ విధంగా మార్చాలో తెలియజేయండి జరిగింది . తప్పక చూడండి .
ఈ వీడియో మీకు నచ్చితే మీ మిత్రులకు షేర్ చేయడం మరవకండి.
Share to All.


రాయరాకుల కర్ణాకర్

3, నవంబర్ 2017, శుక్రవారం

WhatsApp Delete for Everyone Feature of Sent Messeges

WhatsApp Delete for Everyone Feature 

ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న వాట్సాప్‌ డిలీట్‌ఫీచర్‌ ఇప్పుడు అందరికీ అందుబాటులోకి వచ్చింది. ఇకపై ఆండ్రాయిడ్‌, ఐఫోన్‌, విండోస్‌ ఫోన్లలో వాట్సాప్‌ వాడుతున్న వినియోగదారులందరూ ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు. ఇప్పటి వరకు ఎవరికైనా పొరపాటు సందేశం పంపితే దాన్ని డిలీట్‌ చేసే అవకాశం ఉండేది కాదు. దీంతో ఒక్కోసారి భారీ మూల్యాన్నే చెల్లించాల్సి వచ్చేది. ఇకపై వినియోగదారులకు అలాంటి అవసరం లేకుండా వాట్సాప్‌ ఈ కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

డిలీట్‌ ఇలా..
మీ స్నేహితులకో లేదా గ్రూప్‌లోనో పొరపాటున ఓ సందేశాన్ని పంపారనుకుందాం. ఏదైతే మీరు పంపారో ఆ సందేశాన్ని ముందుగా సెలెక్ట్‌ చేసుకోవాలి. ఆ తర్వాత పైన ఉండే డిలీట్‌సింబల్‌ను క్లిక్‌ చేయాలి. డిలీట్‌ ఫర్‌ ఆల్‌ను సెలెక్ట్‌ చేసుకోవడం ద్వారా సందేశాన్ని డిలీట్‌ చేయొచ్చు. కేవలం మీకు మాత్రమే సందేశం డిలీట్‌ కావాలంటే డిలీట్‌ ఫర్‌ మీఆప్షన్‌ను ఎంచుకోవచ్చు.

అయితే, కేవలం 7 నిమిషాల వ్యవధి వరకు మాత్రమే ఈ సదుపాయం వినియోగించే వెసులుబాటు ఉంది. అప్పటికే ఆ సందేశాన్ని ఆ వ్యక్తి చూసినా డిలీట్‌ అవుతుంది. మీరు డిలీట్‌ చేసిన తర్వాత అవతలి వ్యక్తికి సందేశం డిలీట్‌ చేసినట్లుగా చూపుతుంది.

Raad in English : click here